ఆంక్షల వల్ల రూ. 1.50 లక్షల కోట్ల ఆదాయానికి గండి

ముంబై: కరోనా నియంత్రణకు పలు రాష్ట్రాలు వారాంతపు లాక్ డౌన్, రాత్రి కర్ఫ్యూ తదితర రకాల ఆంక్షలు విధించినందున దేశ ఆర్థిక వ్యవస్థ రూ. 1.50 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోనుందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. 2021-22 లో జీడీపీ అంచనాలను 11 శాతం నుంచి 10.4 శాతానికి కూడా తగ్గుతుందని లెక్కగట్టామన్నారు. లాక్ డౌన్కు బదులుగా ప్రజలకు టీకా అందిస్తే సరిపోతుందని బ్యాంక్ ప్రధాన ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్ పేర్కొన్నారు. అందరికీ టీకాలు వేస్తే మొత్తం జీడీపీలో 0.1 శాతం మాత్రమే ఖర్చవుతుంది. ఇప్పటికే విధించిన లాక్ డౌన్ కారణంగా జీడీపీపై 0.7 శాతం భారం పడిందని తెలిపారు. పాక్షిక లాక్ డౌన్ ల వల్ల 80 శాతం నష్టం మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కలుగనుందని అంచనా వేసారు. ప్రజలకు టీకాలు వేయటంలో బ్రిటన్, ఇజ్రాయెల్, చీలీ తదితర దేశాలతో పోలిస్తే ఇండియా వెనుకబడి వుంది. ఇప్పటి వరకూ కేవలం 1.2 శాతం మందికే టీకాలు అందాయి. నిరుడు బ్యాంకుల రుణ వృద్ధి ఆరు దశాబ్దాల కనిష్ఠ స్థాయిలో 5.56 శాతానికి దిగజారింది. బ్యాంకు, ప్రభుత్వ ఉద్దీపనలు ప్రకటించినా, ఫలితం లభించలేకుండా పోయింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos