వడ్డీకి మళ్లీ గండి

వడ్డీకి మళ్లీ గండి

న్యూ ఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఫిక్స్డ్ డిపాజిట్లపై (ఎఫ్డీ)లపై వడ్డీ రేట్లను బుధవారం నుంచి తగ్గించింది. దాదాపు నెల రోజుల వ్యవధిలోనే వడ్డీ రేట్లు రెండో సారి తగ్గించింది. తాజా సవరణల ప్రకారం 7 నుంచి 45 రోజుల కాలావధికి 2.9 శాతం, 46 నుంచి 179 రోజులకు3.9%; 180 నుంచి ఏడాదికి 4.4% ఒక ఏడాది నుంచి 3 ఏళ్ల వరకు 5.1%, మూడేళ్ల నుంచి 5 ఏళ్ల వరకు 5.3%, ఐదేళ్ల నుంచి 10 ఏళ్ల వరకు 5.4 % వడ్డీ మాత్రమే చెల్లిసారు. వృద్దులకు 50 బేసిస్ పాయింట్ల వడ్డీ అదనంగా జమ చేయనున్నారు. అంటే 3 నుంచి 5 ఏళ్ల వరకు డిపాజిట్లపై 5.3 శాతం ఉండగా.. సీనియర్ సిటిజన్లకు 5.8% శాతం చెల్లించనున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos