ఔను ప్రేమించుకుంటున్నాం…

  • In Film
  • February 14, 2019
  • 143 Views
ఔను ప్రేమించుకుంటున్నాం…

తమిళ హీరో ఆర్య త్వరలోనే మూడుముళ్లు వేయబోతున్నాడు. గత కొన్నిరోజులుగా నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తున్న ఆర్య-సాయేషా సైగల్‌ ప్రేమ వ్యవహారంపై వాలెండైన్స్‌ డే సందర్భంగా ఒక క్లారిటీ వచ్చింది.  మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం..ఆశీర్వదించండి అంటూ సాయేషా ట్విటర్‌ వేదికగా కన్‌ఫాం చేశారు. వచ్చే నెలలోనే తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని వెల్లడించారు. మా తల్లిదం‍డ్రులు, ఇతర కుటుంబ సభ్యుల ఆశీస్సులతో మా జీవితాల్లో అతి ముఖ్యమైన రోజు గురించి షేర్‌ చేయాలనుకుంటున్నాం..ఈ సరికొత్త జీవన పయనంలో మీ ప్రేమాభిమానాలు కావాలంటూ  ట్వీట్‌ చేశారు. దీంతో  శుభవార్త అందించిన  ప్రేమ పక్షులపై  అటు ఫ్యాన్స్‌, ఇటు  ఇండస్ట్రీ ప్రముఖులనుంచి అభినందనల వెల్లువ కురుస్తోంది. ఈ ప్రతిస్పందనకు ఉబ్బితబ్బిబ్బవుతున్న ఈ జంట కూడా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతోంది.


తాజా సమాచారం

Latest Posts

Featured Videos