‘సావర్కర్ కిత్నే వీర్?’ను నిషేధించండి

‘సావర్కర్ కిత్నే వీర్?’ను నిషేధించండి

భోపాల్: ‘వీర సావర్కర్ కిత్నే వీర్?’ పేరుతో కాంగ్రెస్ సేవాదళ్ ప్రచురించిన బుక్లెట్ను నిషేధించాలని వినాయక్ దామోదర్ సావ ర్కర్ మనుమడు రంజిత్ సావర్కర్ మధ్య ప్రదేశ్ ప్రభుత్వాన్ని శుక్రవారం డిమాండు చేసారు. భోపాల్లో జరుగుతున్న పది రోజు ల శిక్షణా శిబిరంలో ఈ కర పుస్తకాన్ని కాంగ్రెస్ సేవాదళ్పై కేసు నమోదు చేయాలని కోరారు. హిందూ మహాసభ సహ-వ్యవస్థా పకు డైన వినాయక్ దామోదర్ సావర్కర్కు గాంధీ హంతకుడైన నాథూరామ్ గాడ్సేతో ‘శారీరక సంబంధం’ ఉందని పుస్తకం పేర్కొంది. ఇందుకు లారీ కొల్లిన్స్, డొమినిక్ లపైరే రాసిన ‘ఫ్రీడం ఎట్ మిడ్నైట్’ పుస్తకంలోని 423వ పుటను ఉటంకించింది. సా క్ష్యా ల ఆధారంగానే రచించినట్లు సేవాదళ్ చీఫ్ లాల్జీ దేశాయ్ తెలిపారు. ‘(సావర్కర్) ‘గే’ అవునా కాదా అనేది తమకు ప్రధా నం కాదు. తమకు నచ్చిన విధంగా వ్యహరించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంద’న్నారు. భాజపా గొప్ప హీరోలుగా అభివర్ణించిన వ్యక్తుల నిజ స్వరూపం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ‘సావర్కర్ ప్రతిష్టను దిగజార్చేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. అనుచిత ఆరోపణలతో దేశంలో అరాచక వాదాన్ని ఆ పార్టీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ సేవాదళ్పై ప్రభుత్వం తప్పని సరి గా చర్య తీసుకోవాలి. వారికి వ్యతిరేకంగా భారత శిక్షా స్మృతిలోని 120, 500, 503, 504, 505, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos