కళ్లు మూసుకున్న పాలకులు

కళ్లు మూసుకున్న పాలకులు

పూణె: సమాఖ్య ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే పంటలకు ఉత్పత్తులకు గిట్టు బాటు ధరలు మరింతగా క్షీణిస్తున్నాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ విమర్శించారు. జున్నార్లో జరిగిన రైతు సభలో ఆయన ప్రసంగించారు. ‘ నేను యూపీఏ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల పాటు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్నా. అప్పట్లో పంటలకు గిట్టుబాటు ధరలు లభించేవి. ప్రస్తుతం రైతులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. వ్యయసాయ ఉత్పత్తుల గిట్టుబాటు ధరలు మరింత దిగజారాయి. పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడంతో వాటిని నేలపాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మేల్కొని రైతుల సమస్యలు పరిష్కరించాల’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos