వివాదంలో సప్తగిరి

వివాదంలో సప్తగిరి

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురిస్తున్న సప్తగిరి మాసపత్రికలో రామాయణాన్ని వక్రీకరించారని భాజపా నేతలు నిరసనకు దిగారు. సీతకు లవుడు ఒక్కడే కుమారుడని.. కుశుడు దర్భతో చేసిన బొమ్మ అని జానపద కథ ప్రచురితమైంది. దీన్ని స్థానికంగా తొమ్మిదో తరగతి బాలుడు పునీత్ రాశాడు. తితిదే లాంటి ధార్మిక సంస్థ వాల్మీకి రాసిన రామాయణాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జానపదాలకు ప్రాధాన్యత ఇస్తే రామాయణాన్ని తప్పుదారి పట్టించినట్లవుతుందని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos