నన్ను అవమానించటమే వారి ధ్యేయం

నన్ను అవమానించటమే వారి ధ్యేయం

న్యూ ఢిల్లీ : తనను అవమానించటానికే కొందరు తాను భాజపాలో చేరనున్నట్లు ప్రచారాన్ని చేస్తున్నారని రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ వ్యాఖ్యా నించారు. బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. భాజపాలో చేరే ప్రణాళికలు ఏమీ వేసుకోలేదని వివరించారు. ‘నేను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ సభ్యుడినే. నేను భాజపాలో చేరుతున్నానంటూ జరుగుతోన్న ప్రచారం సరికాదు. నేను గత అన్ని ఎన్నికల్లోనూ భాజపాను ఓడించడానికే పని చేసాను. అలాంటప్పుడు ఆ పార్టీలో ఎందుకు చేరతాన’ని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని వీడుతున్న నేతగానే ఆయన్ను ఆ పార్టీ నేతలు చూస్తున్నారు. ‘సచిన్ పైలట్ కాంగ్రెస్ను వీడవీడడం బాధా కరం. మా పార్టీలో ఆయన ఒక సమర్థవంతుడైన నాయకుడిగా భావించాను. పార్టీని వీడడానికి బదులుగా ఆయన పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నించాల్సి ఉండాల్సింది’ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ పేర్కొన్నారు. సచిన్ పైలట్ కొత్త పార్టీ పెడతారన్న ప్రచారమూ జరుగుతోంది. బొటా బోటి మెజారిటీ ఉన్న ప్రభుత్వం పడిపోకుండా నివారించటానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రయత్నిస్తోంది. భాజపా నేతలు కూడా తదుపరి గద్దె నెక్కే కార్యా చరణ పై చర్చల్ని ముమ్మరం చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos