కార్మికనేత శాంతరాజు కన్నుమూత

కార్మికనేత శాంతరాజు కన్నుమూత

బెంగళూరు: అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ కార్మికనేత శాంతరాజు సోమవారం కన్నుమూశారు. కరోనా నుంచి కోలుకుంటూ కన్నుమూశారు. 1970 జూలై 1న స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సాధారణ గుమస్తాగా చేరిన శాంతరాజు 1977లో ట్రైనీ ఆఫీసర్ స్థాయికి ఎదిగారు. బ్యాంకు అధికారుల ట్రేడ్ యూనియన్ ఉద్యమ ప్రముఖ నాయకుడు ఆర్ఎన్ గాడ్బోలేకు ప్రధాన అనుచరుడైన శాంతరాజు బ్యాంకు అధికారుల సంఘంలో కర్ణాటకలోనూ, జాతీయస్థాయిలోనూ వివిధ హోదాలలో సేవలందించారు. దక్షిణకన్నడ విభాగానికి అధ్యక్షుడిగాను, అఖిల భారత స్టేట్బ్యాంకు అధికారుల సమాఖ్య కార్యదర్శిగాను, స్టేట్బ్యాంకు ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అధ్యక్షుడిగాను అనంతరం అఖిలభారత స్టేట్బ్యాంకు అధికారుల సమాఖ్య ప్రధాన కార్యదర్శిగాను సేవలందించారు. ఎస్బీఐ సెంట్రల్బోర్డులో రెండుసార్లు డైరెక్టర్గా వ్యవహరించారు. బ్యాంకు అధికారుల, సిబ్బంది సమస్యల పరిష్కారానికై ఆయన నిరంతరం పోరాటం చేశారు. జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. శాంతరాజు మృతిపట్ల బ్యాంకు అధికారుల సమాఖ్య తీవ్ర సంతాపం ప్రకటించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos