సంస్కృతంలోనూ ప్రతికా ప్రకటనలు

సంస్కృతంలోనూ ప్రతికా ప్రకటనలు

లఖ్‌నవ్‌:ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ప్రతికా ప్రకటనలు, ముఖ్యమంత్రి ప్రసంగాలు ఇక నుంచి సంస్కృతంలో కూడా వెలువడ నున్నాయని అధికారులు మంగళవారం ఇక్కడ తెలిపారు. సంబంధిత తొలి పత్రికా ప్రకటనను సంస్కృతంలో విడుదల చేశారు. సంస్కృతానికి గత వైభవాన్ని తీసుకురావడానికే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు. దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటి సారి. ఆదిత్యనాథ్ ముఖ్యమైన ప్రసంగాలు, ప్రభుత్వ సమాచారాన్నిహిందీ, ఇంగ్లీష్, ఉర్దూలతోపాటు సంస్కృతంభాషలోనూ విడుదల చేస్తామని వివరిం చారు. ఇటీవల న్యూ ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి యోగి ప్రసంగ పత్రాన్ని సంస్కృతంలో కూడా విడుదల చేశారు. ఇప్పుడు దాన్ని మరింత విస్తరించదలచామని వివరించారు. ముఖ్యమంత్రి ప్రసంగాల్ని సంస్కృతంలోకి అనువదించడానికి లక్నోకు చెందిన రాష్ట్రీయ సంస్కృత సంస్థ సహాయం తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో 25 పత్రికలు సంస్కృతంలో ప్రచురితమవు తున్నాయి. అవేవీ దిన పత్రికలు కావు. సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించిన ఆదిత్యనాథ్ సంస్కృతం ప్రస్తుత పరిస్థితి పట్ల ఆవేదన చెందారు. ‘ఆ భాష అనేది మన రక్తంలోనే ఉంది. భారత దేశంలో సంస్కృత భాష ఒక భాగం. నేడు కేవలం పుజారులకు వృత్తి భాషగా మాత్రమే పరిమితమైంద’ని ఆక్రోశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos