నాకు పెళ్లి కాదన్నారు…

  • In Sports
  • October 3, 2019
  • 153 Views
నాకు పెళ్లి కాదన్నారు…

ఢిల్లీ : క్రీడాకారిణులను ఎవరూ పెళ్లి చేసుకోరని కొంత మంది బంధువులు, కుటుంబ సభ్యులు తనను భయపెట్టారని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తెలిపారు. ఢిల్లీలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, మహిళా నాయకత్వంపై జరిగిన చర్చలో మాట్లాడారు. లింగ వివక్షత గురించి ప్రస్తావించారు. తనకు ఎనిమిదేళ్ల ప్రాయంలో, టెన్నిస్ ఆడే అమ్మాయిలను ఎవరూ పెళ్లి చేసుకోరని బంధువులు చెప్పేవారని తెలిపారు. అమ్మాయిలు ఆటలాడటం వల్ల శరీరం నల్లగా మారిపోయి, అందవిహీనంగా తయారవుతారని బెదిరించేవారన్నారు. అప్పట్లో తాను ఇవేమీ పట్టించుకోకుండా కేవలం ఆటపైనే దృష్టి పెట్టానని వివరించారు. అప్పటితో పోల్చితే సమాజంలో కొంత మార్పు వచ్చిందని, ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆడపిల్లలు క్రీడల్లో రాణించే విధంగా వారికి సదుపాయాలు కల్పించాలన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos