వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై జగ్గారెడ్డి మనసులో మాట..

వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై జగ్గారెడ్డి మనసులో మాట..

తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత,సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌ రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌పై మనసులోని మాటను కుండబద్దలు కొట్టారు.వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి బాథ్యతలు స్వీకరించడానికి తాము సిద్ధంగానే ఉన్నామని ప్రెసిడెంట్‌ పదవి ఇస్తే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం చేసి పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తామన్నారు.పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు,నేతలపై ప్రస్తుతానికి వ్యాఖ్యానించడం ఇష్టం లేదన్నారు.పార్టీలోనే ఉంటూ పార్టీని నాశనం చేయడానికి గోతులు తవ్వుతున్న నేతలపై పార్టీ అధిష్టానం దృష్టి సారించాలంటూ కోరారు. మరోవైపు తాను పార్టీ మారుతానన్న వ్యాఖ్యలపై ఆయన గతంలోనే స్పందించారు.తనను టీఆర్ఎస్‌లోకి రమ్మని ఎవరు పిలవలేదని.. తాను కూడా టీఆర్ఎస్‌లోకి వెళ్లాలని ప్రయత్నించలేదన్నారు. తన రాజకీయ అడుగులన్నీ సంగారెడ్డి ప్రజల కోసమేనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.జూలై 10 నుంచి సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం పూర్తిస్థాయి సమయం కేటాయిస్తానని అన్నారు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos