సినిమాలకు ఆ హీరోయిన్ గుడ్ బై..

  • In Film
  • October 10, 2020
  • 137 Views
సినిమాలకు ఆ హీరోయిన్ గుడ్ బై..

తెలుగులో ‘క‌త్తి’, ‘మిస్ట‌ర్ నూక‌య్య’ వంటి సినిమాల్లో న‌టించిన బాలీవుడ్ నటి స‌నా ఖాన్.. సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతున్నానని షాకింగ్ ప్రకటన చేశారు.ఇకపై సినిమాల్లో నటించబోనని తేల్చి చెప్పింది. అదేసమయంలో తాను మరణించిన తర్వాత చక్కని జీవితం పొందడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చింది. ఇందుకోసం తాను చేయాల్సింది చాలా ఉందని తెలిపింది. ఇంతకీ అంతటి కఠిన నిర్ణయం తీసుకున్న హీరోయిన్ ఎవరబ్బా అని అనుకుంటున్నారా.. ఆమె ఎవరో కాదు.. సనాఖాన్. బాలీవుడ్ నటి. ఈమె బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ కూడా. ఇకపై తాను సినిమాలు చేయనని ప్రకటించింది. సినీ పరిశ్రమ నుంచి వైదొలుగుతున్నట్టు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపింది. దీనికి సంబంధించి ఓ పెద్ద లేఖలో ఇన్‌స్టాలో పోస్టు చేసింది.ఇక నుంచి తాను సమాజ సేవలో తరిస్తానని.. సృష్టకర్త ఆదేశాలను అనుసరిస్తానని తెలిపింది. తన ఫాలోవర్లను ఉద్దేశిస్తూ హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో పెద్ద నోట్‌ను రాసింది. గత కొన్ని రోజులుగా తన జీవితంపై తీవ్ర ఆలోచనల్లో ఉన్నట్టు ఆ లేఖలో ఆమె తెలిపింది. ఇది తన జీవితపు కీలకమైన దశ అని ఆమె చెప్పింది. తన జీవితపు అసలైన పరమార్థాన్ని తెలుసుకొనే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos