ట్రంప్ గెలుపు అమెరికాకు శాపం

ట్రంప్ గెలుపు అమెరికాకు శాపం

వాషింగ్టన్: ‘ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ట్రంప్’అని ట్రంప్ అన్న కూతురు, సైకాలజిస్ట్ మేరీ ట్రంప్రాసిన పుస్తకం – టూ మచ్ అండ్ నెవర్ ఎనఫ్.. హౌ మై ఫ్యామిలీ క్రియేటెడ్ ది వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ మ్యాన్ త్వరలో పాఠకులకు చేరనుంది. అధ్యక్షుడిగా మరోమారు ట్రంప్ను ఎన్నుకుంటే అమెరికన్లు తమను తాము బలి చేసుకున్నట్లేనని అందులో తేల్చిచెప్పారు. ఈ ఆరోపణలను శ్వేతసౌధం కొట్టిపారేసింది. ‘అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, ఇతరుల్లో విభజన భావాలను సృష్టించడం డొనాల్డ్ ట్రంప్కు వెన్నెతో పెట్టిన విద్య’ అని విమర్శించారు. ‘ఈ పుస్తకాన్ని ప్రచురించే నాటికి.. ట్రంప్ గర్వం, అజ్ఞానం వల్ల వేలాది మంది అమెరికన్ల జీవితాలు నాశనం అయిపోయి ఉంటాయి. అధ్యక్షుడిగా ట్రంప్ను రెండోసారి గెలిపిస్తే.. అమెరికాలో ప్రజాస్వామ్యానికి తెరపడినట్టేన’ని హెచ్చరించారు. ‘మేరీ. కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే శాట్స్ పరీక్షను ట్రంప్ రాయలేదు. తన స్నేహితుడితో పరీక్షలు రాయించి భారీ మొత్తంలో సొమ్ములు చెల్లించారు. సోదరి మేరీయాన్తో హోం వర్కులు రాయించేవారు. అయినా గ్రేడ్లు సరిగ్గాలేవు. పరీక్షల్లో గట్టెక్కడానికి జో షాపిరో అనే ప్రతిభావంతుడి చేత తన శాట్స్ పరీక్షలు రాయించారు. ట్రంప్ ఎవరిని లెక్కచేయరు. కుటుంబసభ్యుల మనోభావాలనూ పట్టించు కోరు. మహిళల పై ట్రంప్ వివక్షపూరిత వ్యాఖ్యలు చేయడం తనకు చిన్నతనం నుంచే అలవాట’ని ఏకి పారేసారు. ‘మా నాన్న అయిన, ట్రంప్ అన్న ఫ్రెడ్ జూనియర్ మద్యానికి బానిసై 1981లో 42ఏళ్ల వయస్సులో మృతి చెందారు. అప్పటికి నా వయస్సు 16ఏళ్లు. నా తండ్రి మృతి చెందిన సమయంలోనూ ట్రంప్ సినిమాలకు వెళ్లారు. ఫ్రెడ్కు పైలట్ అవ్వాలని ఉండేది. కుటుంబ వ్యాపారాల్లో చేరాలని తాము ఒత్తిడి తెచ్చినట్టు గతేడాది ట్రంప్ వెల్లడించారు. ఈ పూర్తి వ్యవహారంపై చింతిస్తున్నట్టు తెలిపారు. ఇలా ట్రంప్ తన తప్పును అంగీకరించడం చాలా అరుద’ని వ్యాఖ్యానించారు. ‘మా కుటుంబ సభ్యులకు సంబంధించిని విషయాల్ని ఎక్కడా రాయకూడదని 20 ఏళ్ల కిందట కుదుర్చుకున్న మేరీ ఉల్లంఘించారని అధ్యక్షుడి తమ్ముడు రాబర్ట్ ట్రంప్ వేసిన కేసును న్యూయార్కు న్యాయస్థానం తోసి పుచ్చింది. సిమాన్ అండ్ షుస్టర్ సంస్థ ఈ పుస్తకాన్ని ఈ నెల 14న విడుదల చేయనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos