స్వప్ర,ప్రీణతలకు చేసిన న్యాయమే దిశకు కూడా చేశారు..

స్వప్ర,ప్రీణతలకు చేసిన న్యాయమే దిశకు కూడా చేశారు..

దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనతో సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో మంచి పని చేశారంటూ వేలాది ట్వీట్స్ వెల్లువెత్తుతున్నాయి.దిశ కేసును దర్యాఫ్తు చేస్తున్న ప్రత్యేక బృందానికి సజ్జనార్ స్వయంగా నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. నేటి ఎన్ కౌంటర్ నేపథ్యంలో గతంలో ఆయన వరంగల్ ఎస్పీగా పని చేస్తున్న వేళ జరిగిన మరో ఎన్ కౌంటర్ ను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ళకు ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో  2008, డిసెంబర్ 10 వరంగల్ లో స్వప్నికపై యాసిడ్ దాడి జరిగింది. కాలేజీ నుంచి ఇంటికి వెళుతున్న స్పప్నిక, ఆమె స్నేహితురాలు ప్రణీతలపై శ్రీనివాస్ అనే వ్యక్తి యాసిడ్తో దాడి చేశాడు. సమయంలో అతనికి మరో ఇద్దరు సహకరించారు. వీరందరినీ పోలీసులు అరెస్ట్ చేయగా, జరిగిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఉదంతంలో యాసిడ్ దాడికిపాల్పడిన శ్రీనివాస్ తో సహా అతనికి సహకారం అందించిన మరో ఇద్దరూ పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. సమయంలో వరంగల్ ఎస్పీగా వ్యవహరించారు సజ్జన్నార్.తాజాగా జరిగిన దిశ హత్యాచార ఉదంతానికి వస్తే.. వెటర్నరీ వైద్యురాలిని దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన నలుగురు నిందితుల్ని బహిరంగంగా ఉరి తీయాలని.. కాల్చి చంపాలంటూ దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఇదే సమయంలో నిందితుల్ని విచారణకు తీసుకొని విచారణ చేస్తున్న సమయంలో పారిపోయే ప్రయత్నం చేయగా నలుగురు ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. అప్పుడు.. ఇప్పుడు సంచలన ఉదంతంలో నిందితుల ఎన్ కౌంటర్ లో బిగ్ బాస్ గా సజ్జన్నార్ నిలిచిన వైనాన్ని గుర్తు చేసుకుంటున్నారుకర్ణాటకకు చెందిన ఐపీఎస్ అధికారి కొన్ని విషయాల్లో ఎంతో కఠినంగా ఉంటారని చెబుతారు. తన దగ్గర పని చేసే ఉద్యోగులు సజ్జన్నార్ గురించి.. ఆయన వ్యక్తిత్వం గురించి విపరీతంగా చెబుతారు. పెద్ద అధికారి అయినప్పటికీ చిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తపిస్తారని.. ఇలాంటి ఆఫీసర్ పోలీసు శాఖలో చాలా తక్కువన్న మాట వినిపిస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos