ఇక పాతిక జిల్లాలు

ఇక పాతిక జిల్లాలు

విజయవాడ: రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 13 నుంచి 25కు పెరగనున్నాయని వైకాపా ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గురువారం ఇక్కడ జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమీక్షా సమావేశంలో వెల్లడించారు. ‘పాదయాత్ర సమయంలో జగన్‌ మోహన్‌ రెడ్డి చాలా హామీలు ఇచ్చారు.వాటిని నేరవేర్చేందుకు చాలా కృషి చేస్తున్నారు. పార్టీ కోసం పని చేసే వారికి సముచిత స్థానం కల్పిస్తాం. ఈ దిశగా ఆలోచనలు జరుగుతున్నాయ’ని వివరించారు. ‘వాలంటీర్ల నియామకం గురించి ఆలోచించాం. ప్రజలకు సేవ చేస్తున్నామన్న భావనతో ప్రతి ఒక్కరూ పాటుపడాలి. అవినీతి రహిత పాలన అందించి తిరిగి 2024లో అధికారంలోకి రావాలి. గ్రామ వాలంటీర్లుగా చేయాలకునేవారు తప్పని సరిగా దరఖాస్తు చేసుకోవాలి. గ్రామ సచివాలయ నిర్మాణం జరుగుతోంది. ఇందులో కూడా ఉద్యోగాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించండి. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చే ఆలోచన చేస్తున్నామని’ విశదీకరించారు. పార్టీ కేంద్ర కార్యాలయం హైదరాబాద్‌ నుంచి అమరావతికి తరలించిన తర్వాత గతంలో మాదిరే పార్టీ కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతాయని చెప్పారు.పార్టీ కోసం సేవ చేసే వారందరికీ సముచిత స్థానం దక్కుతుందని భరోసా ఇచ్చారు. పార్టీ కార్యాలయంలో శని, ఆది వారాలలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos