భారత నావికుల అపహరణ

భారత నావికుల అపహరణ

ఢిల్లీ
: నైజీరియాలో భారత్‌కు చెందిన అయిదుగురు నావికులు అపహరణకు గురైనట్లు విదేశాంగ శాఖ మంత్రి
సుష్మా స్వరాజ్‌ మంగళవారం వెల్లడించారు. నావికులను సురక్షితంగా విడిపించడానికి నైజీరియా
ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాల్సిందిగా అక్కడి భారత హైకమిషనర్‌ను ఆదేశించినట్లు తెలిపారు.
ఓడలో మొత్తం 15 మంది సిబ్బంది ఉండగా, సముద్రపు దొంగలు ఏడుగురిని అపహరించారు. వీరిలో
అయిదుగురు భారతీయులు. రెండు వారాల కిందట నైజీరియాలోని బోనీ ఔటర్‌ ఆంకరేజ్‌ నుంచి ఈ
ఓడ బయలుదేరింది. అపహరణకు గురైన నావికుల్లో సుదీప్‌ చౌదరి ఉండగా, ఆయన భార్య భాగ్యశ్రీ
ట్విటర్‌ ద్వారా ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos