కురచ దుస్తుల సినిమాలకు దూరం

కురచ దుస్తుల  సినిమాలకు దూరం

హైదరాబాదు: కురచ దుస్తులేసుకోమంటే ఆ సినిమాకు తాను దూరమైనట్లేనని యువనటి సాయి పల్లవి తేల్చి చెప్పింది. తాజా ఇంటర్వ్యూలో ‘మొదటి నుంచి కూడా తెరపై ఒక సాధారణమైన కాలేజ్ అమ్మాయిలా కనిపించడానికే ఎక్కువగా ఇష్ట పడతాను. పొట్టి బట్టలు వేసుకోవడం . శృతి మించిన వయ్యారాలు ఒలకబోయడం నాకు ఇష్టం ఉండదు. ఫిదా లో పొట్టి డ్రెస్ వేసుకున్నా ఆ సన్నివేశానికి అది అవసరం. అదే మాదిరి మరో సినిమాలో కనిపించాలంటే మాత్రం ఒప్పుకోను వత్తిడి చేస్తే ఆ సినిమాను వదులుకోవడమే. అలా వదులుకున్న సినిమాలు చాలానే వున్నాయ’ని చెప్పింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos