ప్రేక్షకులకు ప్రభాస్ కృతజ్ఞతలు

  • In Film
  • September 5, 2019
  • 116 Views
ప్రేక్షకులకు ప్రభాస్ కృతజ్ఞతలు

హైదరాబాద్ : భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సాహో చిత్రానికి లభించిన స్పందనపై హీరో ప్రభాస్ స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. మీ వల్లే సినిమాకు మంచి పేరు, స్పందన వచ్చాయని పేర్కొన్నారు. మీ ప్రేమకు కృతజ్ఞతలంటూ పోస్ట్ చేశారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన సాహో రూ.350 కోట్ల క్లబ్లో చేరింది. చిత్రానికి మిశ్రమ స్పందన లభించినా, వసూళ్ల పరంగా రికార్డును సృష్టించింది. తొలి రెండు రోజులు విభిన్న టాక్ వినిపించినా, వసూళ్లలో మాత్రం దూసుకుపోతూనే ఉంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జిబ్రాన్ నేపథ్య సంగీతం అందించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos