సాహో కలెక్షన్లు ఇవీ…

  • In Film
  • October 3, 2019
  • 110 Views
సాహో కలెక్షన్లు ఇవీ…

హైదరాబాద్ : సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన చిత్రం `సాహో` దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైంది. ఆగస్టు 30న విడుదలైంది. సినిమాపై భారీ అంచనాలుండగా, ప్రేక్షకులను నిరాశపరిచింది. బాలీవుడ్‌లో మాత్రం భారీ కలెక్షన్లు సాధించి హిట్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం అన్ని భాషల్లోనూ కలిపి 232.6 కోట్ల షేర్ వసూలు చేసింది. థియేట్రికల్ హక్కులను అన్ని భాషల్లోనూ రూ.290 కోట్లకు విక్రయించగా, టోటల్ రన్‌లో 232.6 కోట్ల రూపాయల షేర్ దక్కించుకుంది. థియేట్రికల్ హక్కుల ద్వారా రూ.232 కోట్లు, నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా రూ.138 కోట్లు వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా టోటల్ రన్‌లో రూ.125.40 కోట్లు వసూలు చేసింది. అలాగే తెలుగుతో కలిపి దేశ వ్యాప్తంగా ఈ సినిమా రూ.306.3 కోట్లు దక్కించుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos