ఆరేళ్లయినా ఆరంభం కాని మోదీ మానస పుత్రిక

ఆరేళ్లయినా ఆరంభం కాని మోదీ మానస పుత్రిక

న్యూ ఢిల్లీ : ప్రధాని మోదీ మానస పుత్రిక -సన్సద్ ఆదర్శ గ్రామ యోజన (ఎస్ఏజీవై) పథకం కాగితాలకే పరిమితమైందనే చేదు నిజం వెలుగులోకి వచ్చింది. కామన్ రివ్యూ మిషన్-2019 –సీఆర్ఎం అధ్యయనం ప్రకారం ‘రాష్ట్రాల్లో పర్యటించిన సీఆర్ఎం బృందాలకు ఎస్ఏజీవై వల్ల గ్రామాల్లో చెప్పుకోదగిన మార్పులేవి కనిపించలేదు. ఎంపిక చేసిన ఎస్ఏజీవై పంచాయతీలకు ఎంపీలు తమ ఎంపీల్యాడ్స్ నిధుల నుంచి పెద్దగా నిధులు మంజూరు చేయలేదు. ఎంపీలు క్రియా శీలంగా పనిచేసిన కొన్ని గ్రామాల్లో మాత్రం కొంత మేర మౌలిక సదు పాయాలు మెరుగ య్యాయి. ప్రత్యేకంగా ఈ పథకం వల్ల గుర్తించదగిన మార్పులేవీ లేవు’. అని సీఆర్ఎం నివేదిక పేర్కొంది. 2014 అక్టోబర్ 11న సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన ప్రారంభించారు. ప్రతి పార్లమెంటు సభ్యుడు ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని 2016 నాటికల్లా దాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దాలి. 2019 నాటికి మరో రెండు గ్రామాలను అభివృద్ధి చేయాలి. ఆ తర్వాత 2024 నాటికి ఒక్కో ఎంపీ మరో ఐదు గ్రామా లను ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేయాలి. కొందరు ఎంపీలు తమ నియోజకవర్గాల్లో గ్రామాలను దత్తత తీసుకుంటూ వస్తున్నారు. ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటే నియోజకవర్గంలోని మిగతా గ్రామాలు సదరు ఎంపీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకానికి ప్రత్యేకంగా నిధులేవీ కేటాయించకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos