రెండు చెట్లు నరికినందుకు రూ.1.21 కోట్ల జరిమాన

రెండు  చెట్లు నరికినందుకు రూ.1.21 కోట్ల జరిమాన

భోపాల్: అటవీ శాఖ చెట్లను నరికినందుకు ఆ శాఖ ఛోటే లాల్ అనే వ్యక్తికి ఏకంగా 1.21 కోట్ల రూపాయల జరిమానా విధించింది. భమోరి అడవిలో ఛోటే లాల్ గత జనవరిలో రెండు సాగ్వాన్ చెట్లను అక్రమంగా నరికి కలపను విక్రయించాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు అటవీ అధికారులు రంగంలోకి దిగి విచారించారు. అతణ్ని ఈ నెల 26న అరెస్ట్ చేశారు. చెట్లు నరికినట్టు రుజువు కావడంతో అతడికి రూ.1.21 కోట్ల జరిమానా విధించారు. ఒక్కో సాగ్వన్ చెట్టు తన జీవిత కాలంలో రూ.12 లక్షలు విలువ చేసే ఆమ్లజనిని అందిస్తుంది. ఒక్కో సాగ్వన్ చెట్టు రూ.60 లక్షలు విలువ చేసే ప్రయోజనాలు అందిస్తుందట. నిందితుడు నరికిన రెండు చెట్ల సగటు జీవిత కాలం 50 ఏళ్లు .

తాజా సమాచారం

Latest Posts

Featured Videos