జెర్సీ అంతిమఘట్టం విషాదం..

  • In Film
  • March 27, 2019
  • 147 Views
జెర్సీ అంతిమఘట్టం విషాదం..

క్రికెట్‌ ఆడుతూ మైదానంలోనే ప్రాణాలు కోల్పోయిన క్రికెటర్‌ రమణ్‌
లాంబా జీవితం ఆధారంగా నేచరల్‌స్టార్‌ నాని నటించిన కొత్త చిత్రం జెర్సీ వచ్చేనెల 19వ
తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.ఈ నేపథ్యంలో జెర్సీ చిత్రం క్లైమాక్స్‌కు సంబంధించి చిత్రీకరించిన
రెండు క్లైమాక్స్‌లను చిత్రనిర్మాత దిల్‌రాజు వీక్షించినట్లు తెలుస్తోంది.ఒకటి పాజిటివ్‌
ఎండ్‌ మరొకటి నెగిటివ్‌ అదే స్యాడ్‌ ఎండింగ్‌ క్లైమాక్స్‌లను పరిశీలించిన దిల్‌రాజు
స్యాడ్‌ ఎండింగ్‌ క్లైమాక్స్‌కు మొగ్గు చూపినట్లు సమాచారం. సహజత్వం కోసం చెప్పాలనుకున్న ఎమోషన్ తెరమీద ప్రెజెంట్ కావాలి  అంటే స్యాడ్‌ ఎండింగ్‌ పెట్టక తప్పదని ఫిక్స్ అయ్యారట. ఇది విడుదల రోజు సినిమా చూసే దాకా అధికారికంగా చెప్పే అవకాశం లేదు. ఒకవేళ నానిని నిజంగా అలా చూపిస్తే అభిమానులు ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనే అనుమానాలు లేకపోలేదు.ఒక ఇమేజ్ వచ్చాక హీరోలకు ఇలాంటి క్లైమాక్స్ లు పరీక్ష లాంటివి. ఏ మాత్రం తేడా వచ్చినా ఫలితం మీద అదే ప్రభావం చూపుతుంది.గతంలో నాని హీరోగా కబడ్డి క్రీడ
నేపథ్యంలో నటించిన భీమిలి కబడ్డీ జట్టు చిత్రంలో కూడా ఇలాగే స్యాడ్‌ ఎండింగ్‌ ఉంటుంది.అయితే
అప్పటికి నాని ఇంకా స్టార్‌గా ఎదగలేదు కాబట్టి ప్రయోగం విజయవంతమైంది. కానీ ఇపుడు నాని
స్టార్‌గా ఎదిగి ఎంతోమంది ప్రత్యేక అభిమానులు సొంతం చేసుకున్నాడు.మరి ఇటువంటి తరుణంలో
స్యాడ్‌ ఎండింగ్‌లో నానిని అభిమానులు చూడగలరా అనేది ప్రశ్నార్థకం..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos