ఇది ఆత్మగౌరవ పోరాటం

ఇది ఆత్మగౌరవ పోరాటం

జైపూర్ : ఆత్మ గౌరవం కోసం ఏడాదిగా అవిశ్రాంతంగా ముఖ్యమంత్రి గెహ్లాట్తో పోరాడుతూనే ఉన్నానని తిరుగుబాటు నేత సచిన్ పైలెట్ బుధవారం ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ‘రాహుల్ గాంధీ అధ్యక్ష పీఠం నుంచి వెళ్లిపోయినప్పటి నుంచి గెహ్లాట్ మద్దతుదారులు నాకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. ఆత్మ గౌరవం కోసం ఏడాది నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాను. గెహ్లాట్ పై నాకు ఎలాంటి కోపమూ లేదు. ఆయన నుంచి ఎలాంటి ప్రత్యేకమైన అధికారాలను ఆశించడం లేదు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నదే తమ డిమాండ్. రాజస్థాన్ అభివృద్ధి కోసం పాటుపడదామంటే నన్నూ, నా అనుచరులను గెహ్లాట్ ముందుకు సాగనీయడం లేదు. నా దగ్గరికి దస్త్రాల్ని పంప వద్దని, నా మాట వినకూడదని అధికార గణానికి సూచనలిచ్చారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకపోతే నా విలువ ఉంటుందా? నాకు ఎదురైన ఇబ్బందులను అధిష్ఠానానికి చెందిన దూతలకు చాలా సార్లు వివరించాను. గెహ్లాట్తోనూ ప్రస్తావించా. మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య ఎలాంటి సమావేశాలూ లేవు. కనీసం చర్చించుకోడానికి ఒక గది కానీ, సరైన స్థలం కూడా లేద’ని ఆక్రోశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos