నాయకత్వంతో సచిన్ భేటీ

నాయకత్వంతో సచిన్ భేటీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు సచిన్ పైలట్ శనివారం ఇక్కడకు వచ్చారు. తను భాజపాలో చేరనున్నట్లు వచ్చిన వార్తల్ని ఖండిచారు.గతంలో తనకు చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కలిసి డిమాండ్ చేయనున్నారని అయన సన్నిహిత వర్గాల కథనం. ‘సచిన్ పైలట్ కాంగ్రెస్ను వీడనున్నట్లు ఆయనతో మాట్లాడినప్పుడు వ్యక్తమైంద’ని ఇటీవల కాంగ్రెస్ను వీడి బిజెపిలో చేరిన నేత రీతూ బహుగుణ జోషి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఆమె సచిన్ టెండ్కూలర్తో మాట్లాడిందేమో కానీ ఆమెకు నాతో మాట్లాడేంత ధైర్యం లేదని సచిన్ వ్యాఖ్యానించారు. సచిన్ పైలట్ బిజెపిలో చేరబోరని, వారి రాజకీయాలకు లొంగరని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. తన మద్దతు దారులను, ఎమ్మెల్యేలను మంత్రి వర్గంలో పాటు వివిధ పార్టీ విభాగాల్లో తీసుకోవాలని కోరారు. దీనికి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందన కరువు. నిరుడు దీనిపైనే పార్టీలో అసమ్మతి చెలరేగింది. అయితే అప్పుడు జోక్యం చేసుకున్న అధిష్టానం పైలట్ను నచ్చ జెప్పి పరిష్కారానికి సమితిని వేశారు. ఇప్పటి వరకు సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వీటిని ప్రస్తావించేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లారని తెలుస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos