స్వాముల సౌకర్యాల సమావేశం రేపు

స్వాముల సౌకర్యాల సమావేశం రేపు

తిరువనంతపురం : శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన చర్యల గురించి కేరళ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ మంగళ వారం ఇక్కడ ఐదు రాష్ట్రాల ముఖ్య మంత్రులు, దేవాదాయ మంత్రుల సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఆ రా ష్ట్ర దేవా దాయ మంత్రి శ్రీనివాస రావు పాల్గొన నున్నారు. అయ్యప్ప స్వాములు కోసం శబరిమలైలో అతిథి గృహం, వసతి నిర్మాణానికి స్థలం కేటాయించ మని కేరళ ప్రభుత్వాన్ని గతంలో కోరినట్లు ఆయన తెలిపారు. శబరిమలలోని శ్రీధర్మశాస్త దేవాలయంలో ఈ నెల 17 నుంచి మండల, మకర విళక్కు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల నిర్వహణ, భక్తులకు సౌకర్యాల కల్పన తదితర అంశాల గురించి సమావేశంలో చర్చిస్తారు. అయ్యప్ప భక్తుల సౌక ర్యార్థం పంబ సన్నిధిలో టోల్ ఫ్రీ సర్వీస్ ఏర్పాటు చేయాలి, నీలకంఠ, పంబ శిబిరాల్లో తాగు నీరు, భోజన, అల్పాహార , విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేయాలి, తెలుగులో సమాచారాన్ని ఇవ్వాలి, పంబ బస్సులకు తెలుగు నామ ఫలకాల అమరిక తదితరాల్ని సమకూర్చాలని సమావేశం కోరనున్నట్లు శ్రీనివాస రావు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos