సాహో తెలుగు చిత్రమా?హిందీ చిత్రమా?

  • In Film
  • June 28, 2019
  • 709 Views
సాహో తెలుగు చిత్రమా?హిందీ చిత్రమా?

బాహుబలి అనంతరం అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌ నటించిన కొత్త చిత్రం సాహోపై ఇటీవల విడుదలైన టీజర్‌ అంచనాలను తారాస్థాయికి దాటేలా చేసింది.అంతర్జాతీయ స్థాయిలో సాహో చిత్రంపై అంచనాలు నెలకొనడం చిత్రం విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ముఖ్యంగా దర్శకుడు సుజీత్‌,హీరో ప్రభాస్‌ ప్రచారాలు మొదలుపెట్టారు.అసలు సమస్య ఇక్కడే మొదలైంది.చిత్రంలో హీరో ప్రభాస్‌, నిర్మాత,దర్శకుడు మినహా మిగిలిన నటీనటులంతా పరభాష నటీనటులే ఉండడంతో అసలు ఇది తెలుగు చిత్రమేనా అనే అనుమానం కలుగుతోంది.పైగా దర్శకుడు ప్రవర్తిస్తున్న తీరు కూడా అందుకు ఆజ్యం పోస్తోంది.చిత్రం విడుదల దగ్గర పడుతున్నా కేవలం హిందీ వెర్షన్‌పైనే దృష్టి సారించి కేవలం బాలీవుడ్‌ మీడియాతో మాత్రమే మాట్లాడుతూ తెలుగు వెర్షన్‌పై నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.హిందీలో ఆడితే చాలు అన్నట్లు దర్శకుడు సుజీత్‌ ప్రవర్తిస్తున్నాడని తెలుగు వెర్షన్‌పై పూర్తగా నిర్లక్షంగా వ్యవహరిస్తున్నాడని అందుకే తెలుగు మీడియాతో మాట్లాడడానికి ఏమాత్రం ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.దర్శకుడు,నిర్మాతల తీరు చూస్తుంటే ఏదో హిందీ చిత్రాన్ని తెలుగులోకి అనువాదం చేసి విడుదల చేస్తున్న భావన కలుగుతోందని అసలు ఇది తెలుగు చిత్రమేనా అనే భావన కూడా కలుగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఈ విషయంలో సాహో టీమ్‌ కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలని లేదంటే గతంలో ఇదే తప్పు చేసిన ఒక హీరోకు,చిత్రానికి ఎదురైన పరిస్థతితే సాహోకు కూడా ఎదురవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రెండేళ్ల క్రితం ఓ తెలుగు స్టార్‌ హీరో కూడా ఇదేవిధంగా తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదలైన తన చిత్రం ప్రమోషన్‌లో ఇలాగే వ్యవహరించి కెరీర్‌లోనే అత్యంత భారీ డిజాస్టర్‌ మూటగట్టుకున్నాడు.తెలుగు వెర్షన్‌ కంటే తమిళ వెర్షన్‌కే ప్రాధాన్యత ఇచ్చి భారీ డిజాస్టర్‌ అయ్యాక కానీ తత్వం బోధపడలేదు.అప్పటి నుంచి తెలుగుకే తొలి ప్రాధాన్యతని ఇతర భాషల మార్కెట్‌ గురించి ఆలోచించడం లేదంటూ బుద్దిగా ఉంటున్నాడు.అప్పుడు సదరు హీరో చేసిన తప్పునే ఇప్పుడు సాహో బృందం కూడా చేస్తోంది.ఇప్పటికైనా మేలుకోకపోతే మొత్తానికి కథ అడ్డం తిరుగుతుంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos