ప్రాచీన తెలుగు విశిష్ట కేంద్రాల్నిరెండు రాష్ట్రాల్లో ఆరంభించాలి

ప్రాచీన తెలుగు విశిష్ట కేంద్రాల్నిరెండు రాష్ట్రాల్లో ఆరంభించాలి

మైసూరు:ఇక్కడి ప్రాచీన తెలుగు విశిష్ట కేంద్రాన్ని నెల్లూరికి మార్చిన తర్వాత, మార్చక ముందు, కొన్ని పత్రికలలో, వాట్సాప్ సమూహాలలో వాస్తవాలు తెలియక రాసిన వార్తలు చూచి ఆశ్చర్యం కలిగిందని ప్రముఖ సాహితీ వేత్త , రచయిత ఆర్విఎస్ సుందరం సోమవారం ఇక్కడ వ్యాఖ్యానించారు. ‘తమిళంతో సహా అన్ని క్లాసికల్ భాషా కేంద్రాలు మైసూరులోని భారతీయ భాషాకేంద్రంలోనే ప్రారంభమయ్యాయి. మైసూరులోని
భాషా కేంద్రం అన్ని భారతీయ భాషలకు సంబంధించింది. అది కేంద్రీయ విశ్వవిద్యాలయాల లాగే కేంద్రానికి సంబంధించింది. క్లాసికల్ సెంటర్ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిది కాదని గుర్తించటం లేదు. దీని ధన సహాయం పూర్తిగా కేంద్ర మానవ సంపన్మూల శాఖ పరిధిలోనిది. వంద కోట్లు వస్తాయనే మూఢనమ్మకంతో కొందరు పదేపదే ఆ ఆశను వ్యక్తపరచటానికి ఏ ఆధారమూ లేదు. 15 ఎళ్ల తర్వాత తమిళ కేంద్రం బడ్జెట్ రూ.18 కోట్లనే విషయాన్ని తెలుసుకోవాలి. తెలుగు క్లాసికల్ సెంటర్ కోసం నిజంగా కృషి చేసిన వారిని వెనక్కి నెట్టేసి అధ్యయన కేంద్రం రావటానికి, నెల్లూరి అది రావటానికి ప్రస్తుత ప్రభుత్వం కానీ మరెవ్వరు కానీ కారణం కాదు. దానికోసం కృషి చేసిన వారికి, కేంద్ర మంత్రిత్వ శాఖకు మాత్రమే నిజానిజాలు తెలుసు. భారతదేశ ఉపాధ్యక్షులు వారి చొరవవల్ల మాత్రమే ఇది సాధ్యమయింది. దీనికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఏ సంబంధము లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలోను దీని శాఖలను పెట్టి తెలుగు భాషాభివృద్ధికి కృషి చెయ్యాలని Planning & Monitoring Board సమావేశంలో సూచించాము. ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిది కాబట్టి వారే నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారులకు ఉత్తరాలు రాస్తే కనీసం స్పందించ లేదు. ఏది ఏమయినా ఈ కేంద్రం ఒక పూర్తి స్థాయి స్వతంత్ర సంస్థగా ఏర్పడి ప్రాచీన భాషా సాహిత్యాల పరిశోధనకు, అధ్యయనానికి కృషి చేయాలని ఆకాంక్ష.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos