ఆన్ లైన్ రమ్మి,పోకర్, పేకాట నిషేధం

ఆన్ లైన్ రమ్మి,పోకర్, పేకాట నిషేధం

అమరావతి: ఆన్ లైన్ జూదం, పేకాటలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. గురువారం ఇక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ మేరకు తీర్మానించింది. ఆన్ లైన్లో రమ్మీ, పోకర్ లాంటి జూదాన్ని నిర్వహించే వారికి జరిమానా, శిక్ష విధిస్తారు. ఇందుకు అనుగుణంగా సంబంధిత చట్టం నియమాల సవరణల్ని ఆమోదించారు. త్వరలో ఉత్తర్వు జారీ కానుంది. మొదటిసారి పట్టుబడితే వారికి ఏడాది పాటు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ఒకవేళ రెండో సారి కూడా పట్టుబడితే వారికి రెండేళ్ల జైలు, జరిమానా విధిస్తారు. ఆన్ లైన్లో జూదం ఆడేవారికి కూడా ఆరు నెలల శిక్ష పడుతుంది. కొందరు ఆన్ లైన్ పేకాట నిర్వహిస్తూ యువతను తప్పుదారి పట్టించి డబ్బు పోగొట్టుకుంటు న్నారని మంత్రివర్గం గుర్తించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos