ఖరీదైన కారుకు జరిమానా ఎంతో తెలుసా!

ఖరీదైన కారుకు జరిమానా ఎంతో తెలుసా!

కొద్ది రోజుల క్రితం ట్రాఫిక్‌ జరిమానాలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న అనంతరం దేశంలో పలుచోట్ల ద్విచక్రవాహనాలు, కార్లు,చివరకు లారీలు,బస్సులకు విధించిన భారీ జరిమానాలతో పాటు చిత్రవిచిత్రమైన కారణాలు చూపి బస్సు,లారీ,కార్ల వాహనదారులకు విధించిన జరిమానాలు జాతీయస్థాయిలో చర్చనీయాంశమయ్యాయి.కొత్త జరిమానాలు అమలులోకి వచ్చాక ఇప్పటివరకు భారీమొత్తంలో విధించిన జరిమానా ఎంతో తెలుసా?అక్షరాల రూ.27.68లక్షలు.అహ్మదాబాద్‌ నగరంలో ఓ ఖరీదైన కారు యజమానికి విధించిన ఈ భారీ జరిమానా ఇప్పుడు జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది.కొద్ది రోజుల క్రితం అహ్మదాబాద్‌ నగరంలో ఓ వ్యక్తి ఇటీవల కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన పోర్షే కారును నడుపుకొంటూ రాగా అదు సమయంలో తనిఖీలు చేస్తున్న పోలీసులు ఆపారు.కారుకు నంబర్ ప్లేట్‌తో పాటు కారుకు సంబంధించి ఏఒక్క పత్రం కూడా లేకపోవడంతో మొదట రూ. 9. 80 లక్షల ఫైన్ వేసిన అధికారులు, ఆరు వారాల తరువాత దాన్ని సమీక్షించారు. జరిమానాను రూ. 27.68 లక్షలకు పెంచుతున్నట్టు తెలిపారు.ఇండియాలో ఇదే అత్యధిక జరిమానా అని అహ్మదాబాద్ పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. వాహనం నడిపే సమయంలో వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ), ఇన్సూరెన్స్ పేపర్స్, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికేట్ తప్పనిసరని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos