సమాచార హక్కు హరణకు యత్నం

న్యూఢిల్లీ: సమాచార హక్కు చట్టాన్ని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయదలుస్తోందని కాంగ్రెస్ నేత, యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ మంగళవారం ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆరోపించారు. చట్టం ప్రతిపత్తిని దెబ్బతీయడమే లక్ష్యంగా కేంద్రం పావులు కదుపుతోందని దుయ్యబట్టారు. గత పదేళ్లలో అరవై లక్షల మంది సమాచారహక్కు (స.హ) చట్టాన్ని వినియోగించుకున్నారని గుర్తు చేశారు. భాజపా ప్రభుత్వం తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాల వల్ల చట్టం పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఏర్పడిందని హెచ్చరించారు. సుదీర్ఘ చర్చలు, విస్తృత సంప్రదింపులతో 2005 లో సమాచార హక్కుచట్టాన్ని రూపొందించినట్లు వివరించారు. దీని వ ల్ల ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగిందన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos