జనవరి కల్లా విలీనం పూర్తి

జనవరి కల్లా విలీనం పూర్తి

విజయవాడ: తమ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైతే రూ.3,300 కోట్లు మిగులుతుందని రహదారి రవాణా సంస్థ తాత్కాలిక కార్యనిర్వాహక సంచాలకులు కృష్ణబాబు గురువారం ఇక్కడ తెలిపారు. విలీన ప్రక్రియను జనవరి కల్లా ముగించే ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.ప్రస్తుతం సంస్థ ప్రతి నెలా రూ.100 కోట్ల వరకూ నష్ట పోతోందన్నారు. 2015 నుంచి ఇంధనం, సిబ్బంది, జీత భత్యాలు పెరగడం ఇందుకు కారణమన్నారు. డీజి ల్ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సుల్ని ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం తీర్మానించిందని చెప్పారు. డీజిల్ బస్సుకు కి.మీ వ్యయం రూ.13కాగా విద్యు త్ బస్సు వ్యయం కేవలం రూ.3 మాత్రమేనన్నారు. ఈ ఏడాది వేయి విద్యుత్ బస్సులు కొనదలచినట్లు చెప్పారు. దసరా సందర్భంగా 1300 బస్సు లు హైదరబాద్ నుంచి300 బస్సులు, బెంగళూరు నుంచి బస్సుల్ని అదనంగా నడపబోతున్నట్లు వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos