మోదీకి పరివార్‌ మద్ధతు కరువు

మోదీకి పరివార్‌ మద్ధతు కరువు

గత లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని కూడా భాజపా ప్రభుత్వం ఈడేర్చనందుకు ఆ పార్టీకి ఆరెస్సెస్ కూడా మద్దతు ఉపసంహరించుకుందని బీఎస్పీ అధినేత్రి మాయావతి మంగళవారం ట్వీట్లో తెలిపారు. భాజపాకు అండగా ఉంటే తమకు కూడా చెడ్డ పేరు వస్తుందని ఆరెస్సెస్ నేతలు భావిస్తున్నారని చెప్పారు. చివరి దశ పోలింగ్ తరుణంలో కమలనాధులపై మాయావతి విమర్శలు గుప్పించారు. ‘మోదీ ఓడిపోతున్నారనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆరెస్సెస్ కూడా ఆయనకు మద్దతు ఇవ్వడం లేదు. భాజపా ప్రచారంలో ఆరెస్సెస్ నేతలు, కార్యకర్తలు ఎవరూ కనిపించడం లేదు. దీంతో మోదీ చాలా ఒత్తిడికి గురవుతున్నారు. ఈ దేశం ఇప్పటి వరకు సేవక్, జన సేవక్, చాయ్ వాలా, చౌకీదాద్ వంటి ఎందరో నాయకులను చూసింది. దేశ ప్రజల సంక్షేమాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించే స్వచ్ఛమైన ప్రధాని ఇప్పుడు అవసరమని’ పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేతలు ఆలయా లకు వెళ్లి ప్రార్థనలు చేయడం అలంకరణగా మారిందని ఎద్దేవా చేశారు. వీటిని మాధ్యమాలు కూడా మితిమీరి ప్రసారం. ప్రచారాన్ని చేస్తున్నా యని తప్పుబట్టారు. ఎన్నికల సంఘం దీన్ని నిషేధించాలని కోరారు. రహదారి ప్రచారాలకు చేస్తున్న భారీ ఖర్చుల్ని ఎన్నికల వ్యయాల్లో చూపించాలన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos