విమర్శకుల గొంతులపై బెదిరింపుల కత్తులు

విమర్శకుల గొంతులపై బెదిరింపుల కత్తులు

న్యూఢిల్లీ: ప్రభుత్వ విధానాలను తప్పుబట్టిన,విమర్శించిన, ఆక్షేపించిన వారిపై కక్ష సాధింపులు నిరాటంకగా సాగుతున్నాయని భారత రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తన బ్లాగ్లో సోమవారం వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వ విధానాలను విమర్శించిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ అధికారుల నుంచి ఫోన్లో బెదిరింపులు వస్తున్నాయి. లేదంటే అధికార పార్టీ నేతలు కొందరు వారిపై ధ్వజమెత్తుతారు.ఇందువల్లే విమర్శకులు గొంతె త్తడం లేదు. ఇలాగైతే ప్రభుత్వ విధానాల్లో పొరపాట్లను లేవనత్తడానికి ఎవరూ ముందుకు రారు. చారిత్రక అభివృద్ధి, విదేశీ విధానాలను ప్రభు త్వం వ్యతిరేకిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లుతుంది. చరిత్రను అర్థం చేసుకోవడం ముఖ్యమే. దాన్ని అడ్డం పెట్టుకుని మాట్లాడటం అభద్రత భావానికి నిదర్శనం. ఇలాంటి విధానాలు ఎవరీకీ లాభం చేకూర్చవు’ అని వ్యాఖ్యానించారు. ఆర్థిక మందగమనం ఆందోళన కలిస్తోందని ఆయన ఇటీవల పేర్కొ న్నారు. దాని వల్ల ఏర్పడిన సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని సూచించారు. కొత్త సంస్కర ణలతో ప్రైవేటు రంగంలో పెట్టుబడులను ఆహ్వానించాలని కోరారు.

తాజా సమాచారం