అనిశ్చితి తొలగింపునకు రక్త పరీక్షలు పెంచాలి

అనిశ్చితి తొలగింపునకు రక్త పరీక్షలు పెంచాలి

న్యూ ఢిల్లీ : కరోనా వైరస్ వల్ల మన దేశం స్వాతంత్ర్యానంతరం అత్యంత గడ్డు పరిస్థితుల్లోకి కూరుకుపోయిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. ఆర్థిక పరిభాషలో ఇండియా ఇప్పుడు గ్రేటెస్ట్ ఎమర్జెన్సీలో ఉన్నట్టే. అన్ని రకాల వస్తువుల డిమాండ్ పడి పోయింది. 2008-09లో డిమాండ్ లేకున్నా, పరిశ్రమలు పని చేశాయి. ఎన్నో సంవత్సరాలు బలమైన వృద్ధిని నమోదు చేస్తూ వచ్చిన కంపెనీలు, బలమైన ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు కనిపించడం లేదు. కరోనా వల్ల ఇండియా దిగజారి పోయింద ని లింకెడిన్ కు రాసిన వ్యాసంలో అభిప్రాయపడ్డారు. 21 రోజుల లాక్ డౌన్ వల్ల కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచించుకునే సమయాన్ని ఇచ్చింది. రక్త నమూనాల పరీక్షలు పెరిగితేనే అనిశ్చితి తొలగుతుంది. ఈ దిశగా ప్రభుత్వమే కల్పించుకోవాల’ అన్నారు. స్థితికి చేర్చవచ్చని ఆయన సూచించారు. ఆయా ప్రాంతాల్లోనూ మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాజన్ సలహా ఇచ్చారు.బ్యాంకు ఖాతాల్లోకి నగదు బట్వాడా అత్యధికులకు చేరినా, అందరికీ చేరుతుందని భావించలేమని, ఈ పరిస్థితి రాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. పేదలకు నెలకు సరిపడినంత మొత్తాన్ని అందించడం లేదన్న అభిప్రాయం కూడా నెలకొనివుందని అభిప్రాయపడ్డారు.పారిశ్రామిక దిగ్గజాలు, చిన్న కంపెనీల్లో నిధుల కొరత రాకుండా చూసుకోవాలని సూచించారు. కార్పొరేట్ బాండ్ మార్కెట్లు కూడా ఇందుకు సహకరించాలన్నారు. బ్యాంకులు, బీమా కంపెనీలు తమ పెట్టుబడులను మరింతగా పెంచడం ద్వారా, నగదు లభ్యతను కొనసాగించ వచ్చని సూచించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos