జెట్ స్పీడుతో గవర్నర్ స్పందించారు

జెట్ స్పీడుతో గవర్నర్ స్పందించారు

ముంబై: ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ను గురువారం దిగువ సభలో బలాన్నినిరూపించుకోవాల్సిందిగా గవర్నర్ ఆదేశించటం పై శివసేన కీలక నేత సంజయ్ రౌత్ హేళన చేసారు. ‘ జెట్ కంటే గవర్నర్ వేగంగా స్పందించారరు. రాఫెల్ యుద్ధ విమానం కూడా ఇంతకంటే వేగంగా కదలద’న్నారు. బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు.‘
తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోక ముందే బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించడం చట్ట విరుద్ధం. ఈ ఎమ్మెల్యే లపై చర్యలు తీసుకోనంత వరకు బలపరీక్ష వద్దని చెపుతూనే ఉన్నాం. మేము ప్రతి ఒక్కటి చట్టానికి లోబడే చేశాం. మీరు మాతో పోరాడాలను కుంటే ముందు వైపు నుంచి పోరాడాలి. గవర్నర్ గురించి తాము ఎక్కువగా మాట్లాడబోము. ఆయన రాజ్యాంగపరమైన పెద్ద . ఆయన వివక్షపూరితంగా వ్యవహరిస్తే మేమూ అలాగే వ్యవహరిస్తామ’ని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos