ఫిలిం సిటీని ఇతర ప్రాంతానికి మార్చడం సులభం కాదు

ఫిలిం సిటీని ఇతర ప్రాంతానికి మార్చడం సులభం కాదు

ముంబై: ఇక్కడి నుంచి ఫిలింసిటీని ఇతర ప్రాంతానికి మార్చడం అంత సులభం కాదని శివసేన సీనియర్ నాయకుడు, పార్ల మెంటు సభ్యుడు సంజయ్ రౌత్ బుధవారం వ్యాఖ్యానించారు. బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు.‘ముంబై చిత్ర నగరానికి సుదీర్ఘ చరిత్ర ఉంది, ఇది చాలా సంవత్సరాలుగా చాలా కష్టపడి అభివృద్ధి చెందింది. పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ సూట్ లో నటుడు అక్షయ్ కుమార్ తో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ,అక్షయ్ కుమార్ భేటీ అయితే ఫిలింసిటీ మారదు. పశ్చిమ బెంగాల్, పంజాబ్ ల్లోనూ చలనచిత్ర నగరాలున్నాయి. ఆదిత్యనాథ్ ఆ ప్రదేశాలనూ సందర్శించి అక్కడి కళాకారులు, దర్శకులతో మాట్లాడుతారా? లేదా కేవలం ముంబైలో మాత్రమే ఇలా మాట్లాడుతారా? చిత్ర పరిశ్రమకు సంబంధించి దేశంలో ఏదైనా పెద్ద పథకం వస్తే దానికి నా శుభా కాంక్షలు’ అని వ్యాఖ్యా నించారు.యూపీలో సినిమాలు నిర్మిస్తే చిత్ర నిర్మాతలకు అన్ని సౌకర్యాలు సహకారం అందిస్తామని ఆదిత్య నాథ్ ప్రకటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos