మోదీ సెల్ఫ్ క్వారంటైన్‌కి వెళ్తారా..?

మోదీ సెల్ఫ్ క్వారంటైన్‌కి వెళ్తారా..?

ముంబై: ప్రధాని మోదీ కోవిడ్ నిబంధనలను ఎందుకు పాటించడం లేదని శివసేన పత్రిక సామ్నాప్రశ్నించింది. మోదీ హోం క్వారంటైన్లోకి ఎందుకు వెళ్లటం లేదని ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు పీ.సంజయ్ రౌత్ నిలదీశారు ‘ఆగస్టు 5న అయోధ్యలో మహంత నృత్య గోపాల్ దాస్తో కలిసి మోదీ రామ మందిర నిర్మాణ భూమి పూజ లో పాల్గొన్నారు. గోపాల్ దాస్ ముక్కుకు ముసుగు వేసుకోలేదు. మోదీ గోపాల్ దాస్ చేతినీ మోదీ తాకారు. అందుకే మోదీ కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాల’న్నారు నృత్య గోపాల్ దాస్ ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. అప్పళం తింటే కరోనా రాదన్న న కేంద్ర మంత్రి అర్జున్ సింగ్ మేఘవాల్ పైనా సంజయ్ రౌత్ దుయ్యబట్టారు. ‘భారత్ భాబీజీ అప్పడం దగ్గరే ఆగిపోయింది. రష్యా కొవిడ్-19కు వ్యాక్సిన్ కనిపెట్టి ఆత్మ నిర్భరతను చూపింది. మనం మాత్రం ఆత్మ నిర్భర భారత్పై ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటాం’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos