రైల్‌ రోకో విజయవంతం

రైల్‌ రోకో విజయవంతం

న్యూ ఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు దేశవ్యాప్తంగా రైతులు రైల్రోకో చేపట్టారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన రైల్రోకో కాసేపట్లో ముగియనుంది. పంజాబ్లోని అమృత్సర్, లూథియానా, ఫతేనగర్ సాహిబ్, హరియాలోని పలు ప్రాంతాలు, జమ్ము, బిహార్లోని పట్నా, కర్ణాటక రాజధాని బెంగళూరులో రైతులు పట్టాలపై బైఠాయించారు. శుక్రవారం ముంబయిలో కిసాన్ పంచాయత్ నిర్వహించనున్నారు. రైతులు ప్రతిచోట ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. మద్దతు ధరకు చట్ట భద్రత కల్పంచడం ద్వారానే వాటన్నింటికి పరిష్కారం లభిస్తుందని రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు. రైల్రోకోకు దేశవ్యాప్తంగా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. రైల్వే శాఖ 20 వేల మంది రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ ను రంగంలోకి దించింది. పంజాబ్, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్ , బంగాల్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచారు. శాంతిభద్రతల పర్యవేక్షణకు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos