బాలయ్యకు ప్రత్యర్థిగా రోజా!

బాలయ్యకు ప్రత్యర్థిగా రోజా!

ఇప్పుడుంటే రాజకీయాల్లోకి వెళ్లి ప్రత్యర్థులయ్యారు కానీ రెండు దశాబ్దాల క్రితం బాలయ్య,రోజా కాంబినేషన్‌లో చిత్రమంటే ప్రేక్షకులకు కన్నుల పండుగే.అంతగా రోజా,బాలయ్య జంట వెండితెరపై అలరించింది.రాజకీయాల్లో కొనసాగుతూనే ఇద్దరు ఇప్పటికీ చిత్రాల్లో నటిస్తున్నా చాలా ఏళ్లుగా ఒకే చిత్రంలో మాత్రం కనిపించలేదు. వేర్వేరు పార్టీల్లో ఉంటున్నా ఒకరిపై ఒకరు విమర్శలు సైతం చేసుకోలేదు.దీంతో బాలయ్యతో రెండు హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు బోయపాటి బాలయ్యతో ముచ్చటగా మూడోసారి తెరకెక్కించనున్న కొత్త చిత్రంలో రోజాను నటింపచేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రోజా పాత్ర నెగిటివ్గా ఉంటుందని విరామం వద్ద ప్రవేశించే రోజా పాత్ర ద్వితీయ భాగం అంతటా ఉంటుందని సమాచారం.ఈ పాత్రకు రోజా అయితేనే న్యాయం చేయగలదని భావించి బోయపాటి రోజాను ఒప్పించే పనిలో పడ్డారట.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos