రోహిత్‌ చిత్ర ప్రదర్శనకు అనుమతి నిరాకరణ

రోహిత్‌ చిత్ర ప్రదర్శనకు అనుమతి నిరాకరణ

ముంబై:విమర్శకు ప్రశంసలందుకున్న పలు డాక్యుమెంటరీ చిత్రాల్ని ఇక్కడ ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి మూడు వరకూ జరగ నున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు నిరాకరించారు. 2016లో రోహిత్ వేముల ఆత్మహత్య గురించి ‘వియ్ హావ్ నాట్ కమ్ ఇయర్ టు డై’ పేరిట దీపా ధన్రాజ్ నిర్మించిన డాక్యుమెంటరీ, 2018లో ఆమ్స్టర్డామ్లో జరిగిన అంత ర్జాతీయ డాక్యుమెంటరీ చిత్రోత్సవంలో రీజన్ చిత్రం ‘బెస్ట్ ఫీచర్ లెన్త్ డాక్యుమెంటరీ పురస్కారాన్ని అందు కుం ది. కమ్యూ నిస్టు నాయకుడు గోవింద్ పన్సారే, హేతువాది నరేంద్ర దాభోల్కర్ను హిందుత్వ వాదులు హత్య చేయడంపై ప్రముఖ దర్శకుడు ఆనంద్ పట్వర్ధన్ ఈ డాక్యుమెంటరీని తీశారు. దీన్నీ ప్రదర్శనకు అనుమతించలేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందు కుం టు న్న గాయకురాలు, గేయ రచయిత్రి, మ్యూజిక్ కంపోజర్ సోన మొహాపాత్ర పై దీప్తి గుప్తా తీసిన ‘షటప్ సోనా’కు, కళాకారు డు కౌషిక్ ముఖోపాధ్యాయ్పై అవిజిత్ ముకుల్ కిషోర్ తీసిన ‘స్క్వీజ్ లైమ్ ఇన్ యువర్ ఐ’ చిత్రానికి , రోహన్ శివ కుమార్ తీసిన ‘లవ్లీ విల్లా’, అర్చనా పాడ్కే తీసిన ‘అబౌట్ లవ్’ చిత్రాలకూ అనుమతి నిరాకరించారు. నిష్మక్షపాతంగానే వీటిని అనుమ తిని నిరాకరించినట్లు ఫిల్మ్స్ డివిజన్ డైరెక్టర్ జనరల్, ముంబై అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్ స్మితా వాట్స్ శర్మ తెలిపా రు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos