రోహిత్ శర్మకు జరిమానా

  • In Sports
  • April 29, 2019
  • 116 Views
రోహిత్ శర్మకు జరిమానా

కోల్‌కతా : ఐపీఎల్‌లో అంపైర్లపై కెప్టెన్ల రుసరుసలు కొనసాగుతూనే ఉన్నాయి. కోహ్లీ, ధోనీ తర్వాత తాజాగా రోహిత్‌ శర్మ ఆ జాబితాలో చేరాడు. ఆదివారం రాత్రి కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌ సమయంలో నాలుగో ఓవర్‌లో మూడో బంతికి రోహిత్‌ను అంపైర్‌ నితిన్‌ మీనన్‌ ఎల్‌బీడబ్ల్యుగా ప్రకటించారు. దీనిపై రోహిత్‌ సమీక్షకు వెళ్లాడు. సమీక్షలో బంతి కొద్ది ఔట్‌సైడ్‌లో పడడంతో పాటు లెగ్‌ వికెట్‌ను కొంచెం తాకుతూ వెళ్లినట్లు కనిపించింది. దీంతో థర్డ్‌ అంపైర్‌…అంపైర్‌ కాల్‌కు అవకాశం ఇచ్చాడు. షరా మామూలుగా అంపైర్‌ ఔటైనట్లు ప్రకటించడంతో రోహిత్‌ శర్మ అంపైర్‌ దగ్గరికి వచ్చి ఏవో వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా అక్కడున్న స్టంపులను తన బ్యాటుతో కొట్టాడు. దీని వల్ల అతనికి పీఎల్‌ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద మ్యాచ్‌ ఫీజులో 15 శాతాన్ని జరిమానాగా విధించారు. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 34 పరుగుల తేడాతో ఓడిపోయింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos