రోగుల సేవలకు మర మనుషులు

రోగుల సేవలకు మర మనుషులు

గౌహతి : కోవిడ్-19 రోగుల సేవలకు ఇక్కడి ఐఐటీ పరిశోధకులు రెండు రోబోలను తయారు చేస్తున్నారు. ఇవి కరోనా రోగులకు ఆహారం, మందులు అందించడం, వ్యర్థాలను సేకరించడం వంటి పనుల్ని చేపడతాయి. ఐసోలేషన్ వార్డుల్లో వైద్య సిబ్బందికి వైరస్ ముప్పును తగ్గించేందుకు ఇవి ఉపకరిస్తాయి. రెండు వారాల్లో ఈ రోబోల నమూనాలు తయారవుతాయని, అనంతరం సంస్థ ఆస్పత్రిలో, వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చే సెంటర్ ఆఫ్ నానోటెక్నాలజీలో పరీక్షిస్తామని తెలిపారు. తదుపరి రోగ నిర్ధారణకూ రోబోల్ని తయారు చేయదలచామన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos