బద్రీనాథ్ జాతీయ రహదారిని మూసి వేత

బద్రీనాథ్ జాతీయ రహదారిని మూసి వేత

డెహ్రాడూన్ : చమోలీ జిల్లా, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ శిబిరానికి సమీపంలో కొండ చరియలు విరిగినందున బద్రీనాథ్ జాతీయ రహదారిని మూసి వేసినట్లు అధికారులు తెలిపారు. దారికి అడ్డంగా పడిన రాళ్లను తొలగిస్తున్నామని చెప్పారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని వివరించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. గత రెండు రోజుల క్రితం తెహ్రీ గర్వాల్ జిల్లా బయాసీ సమీపంలో రిషికేశ్-బద్రీనాథ్ (జాతీయ రహదారి 58)పై కొండ చరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా డెహ్రాడూన్ నుండి బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి వెళ్లే రహదారులపై కొండచరియలు తరుచుగా విరిగి పడుతుంటాయి. నాలుగు జాతీయ రహదారులతో సహా 100కు పైగా రహదారులను ఇప్పటికే మూసి వేసినట్లు విశదీకరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos