కావేరి సంరక్షణ ఉద్యమం

కావేరి సంరక్షణ ఉద్యమం

హొసూరు : కావేరి నది సంరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, ఇదో ఉద్యమంలాగా సాగాలని ఆధ్యాత్మికవేత్త జగీ వాసుదేవన్ పిలుపునిచ్చారు. కావేరి నది పరీవాహకంలో వచ్చే 12 ఏళ్లలో 242 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమంపై ప్రజా చైతన్యం కలిగించే క్రమంలో భాగంగా ఈషా యోగా సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీ బుధవారం తమిళనాడులో ప్రవేశించింది. ఈ నెల 3న తలకావేరిలో ఈ ర్యాలీ ప్రారంభమైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హొసూరులో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. కావేరి పరీవాహక ప్రాంతాల్లో 87 శాతం చెట్లను నిర్మూలించారని ఆయన వాపోయారు. ఈ పరీవాహకంలో 35ఏళ్ల కిందటి వరకు ఏడాదిలో వంద నుంచి 140 రోజులు వర్షాలు పడేవని, ఇప్పుడు 40 నుంచి 75 రోజులు మాత్రమే పడుతున్నాయని వెల్లడించారు. ఇలాంటి తరుణంలో అధిక సంఖ్యలో మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని తెలిపారు. గత ఇరవై ఏళ్లలో మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెప్పారు. దీనికి కేవలం రుణ భారం మాత్రమే కారణం కాదని, సారవంతమైన భూమి లేకపోవడం, సరైన సాగు నీటి సదుపాయం లేకపోవడం కారణాలని ఆయన వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos