పోలవరం’ రద్దుపై నవయుగ వ్యాజ్యం

పోలవరం’ రద్దుపై నవయుగ వ్యాజ్యం

అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల కాంట్రాక్టును రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ జారీ చేసిన ఆదేశాలను నిలిపి వేయాలని కోరుతూ గుత్తే దారు నవ యుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ ఉన్నత న్యాయస్థానాన్నికోరింది. పోలవరం హెడ్వర్క్స్, జలవిద్యుత్ కేంద్రం పనులను కొనసాగించడంతో పాటు ఈ కాంట్రాక్టును మరెవరికీ కేటాయించకుండా ఉత్తర్వులు జారీచేయాలని విన్నవించింది.ప్రభుత్వ నిర్ణయం వల్ల ఆర్థికంగా తీవ్ర నష్టం జరుగు తుంద నీ, సంస్థ ప్రతిష్టకూ అంతర్జాతీయంగా నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. పోలవరం ప్రాధికార సూచనల్ని కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని తప్పు బట్టిం ది. దురుద్దేశంతోనే తమ గుత్తను రద్దు చేసిందని ఆరోపించింది. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను మంగళవారం మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos