లోకేశ్‌ను ఏడిపిస్తున్న వర్మ..

  • In Film
  • November 9, 2019
  • 146 Views
లోకేశ్‌ను ఏడిపిస్తున్న వర్మ..

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు టైటిల్‌తో తెరకెక్కిస్తున్న కొత్త చిత్రంలో తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతల తాలూకా పాత్రలను ఇప్పటికే పరిచయం చేసిన వర్మ అందరికంటే నారా లోకేశ్‌నే ఎక్కువగా టార్గెట్ చేసుకున్నాడు.కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన ట్రైలర్‌లో చంద్రబాబు నారా లోకేశ్‌ను పప్పు వడ్డిస్తున్న దృశ్యంతో అగ్గిరాజేసిన వర్మ తాజాగా సెటైరికల్ ఫోటోలు.. వీడియోలు విడుదల చేశాడు. తాత(ఎన్టీఆర్) సైకిల్ లాక్కున్నావు.. నన్ను తొక్కమంటే ఆసక్తి లేదు!! ఫారిన్ వెళ్లిపోతా.. అంటూ లోకేష్ నాయుడు మదనపడుతున్న ఓ సాంగ్ ని రిలీజ్ చేసేందుకు ఆర్జీవీ సన్నాహకాల్లో ఉన్నారు. అంతకుముందే ఈ పాటకు సంబంధించిన టీజర్ గ్లింప్స్‌తో మరోసారి వాడి వేడిగా చర్చకు తెర లేపారు. తేదేపా అధినాయకుడు చంద్రబాబు.. యువనాయకుడు లోకేశ్‌పై సెటైరికల్ పేరడీ గీతమిది.తాతగారి సైకిల్ నువ్వు లాక్కుని తొక్కతున్నాయి. నన్ను కూడా తొక్కమంటున్నావు. నాకు అంత సరదా లేదు గానీ నన్ను వదిలేయ్… నేను ఫారిన్ వెళ్లి పోతా.. నా జల్సా చేసుకుంటాను. పచ్చనైన మా డాడీ చెబుతున్నాను ముద్దాడి”.. అంటూ సాగే టీజర్ ని రిలీజ్ చేశారు. పూర్తి పాటను రిలీజ్ చేయనున్నామని ప్రకటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos