అతను రోజా దిష్టిబొమ్మేమో..

అతను రోజా దిష్టిబొమ్మేమో..

మూడు రాజధానుల అంశంపై బుధవారం శాసనమండలిలో అధికార,ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరుగుతుండగా మధ్యలో లాబీలో కూర్చున్న బాలకృష్ణతో సెల్ఫీలు దిగడానికి వైసీపీ ఎమ్మెల్యేలు ఆసక్తి చూపారు.వైసీపీ ఎమ్మెల్యే రోజా సైతం బాలయ్యతో జోరుగా సెల్ఫీలు దిగగా అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.దీంతో ఈ సెల్ఫీలపై నెటిజన్లు ఒక్కో రకంగా స్పందిస్తుండగా వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ దీనిపై తనదైన శైలిలో స్పందించాడు.వావ్రోజాగారు హీరోలా కనిపిస్తున్నారు. ఎవరో పక్కన ఉన్నారుగానీ, నాకు తెలియదు. చూసేందుకు.. యాక్అనేలా కనిపిస్తున్నాడు. రోజా అందాన్ని తన ముఖంతో ఆయన చెడగొడుతున్నారు. బహుశా అతను రోజా దిష్టిబొమ్మేమోఅని అన్నారు. ఆపైఅందంగా ఉన్న రోజా పక్కన చిత్రంలో ఉన్నది ఎవరో ఎవరైనా చెప్పగరా?” అని ప్రశ్నించారు. వర్మ ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos