రామ్ గోపాల్ వర్మపై టీడీపీ పోలీసులకు ఫిర్యాదు

రామ్ గోపాల్ వర్మపై టీడీపీ పోలీసులకు ఫిర్యాదు

విజయవాడ: ఏపీలో ఇప్పుడు అందరి దృష్టి సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ‘వ్యూహం’ పైనే ఉంది. ముఖ్యమంత్రి జగన్ కు అనుకూలంగా ఈ సినిమాలో టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించేలా సన్నివేశాలు ఉన్నాయి. ఈ సినిమాకు చెందిన ట్రైలర్ కూడా విడుదలయింది. ఈ ట్రైలర్ పై టీడీపీ రీసర్చ్, కమ్యూనికేషన్ కమిటీ సభ్యుడు గంగాధర్ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను కించపరిచేలా ట్రైలర్ ఉందని ఈ సందర్భంగా గంగాధర్ తెలిపారు. రెండు పార్టీల కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా పాటల్లోకి కొన్ని పదాలు, అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పారు. రామ్ గోపాల్ వర్మతో పాటు చిత్ర నిర్మాత దాసరి కిరణ్, నటీనటులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos