టీడీపీ ఫ్యూచర్‌‌ దబిడి దిబిడే

హైదరాబాదు: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఆరెస్టయిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం జ్యుడిషిల్ రిమాండ్తో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆయన అరెస్టును తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఖండిస్తున్నారు. అయితే, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం సోషల్ మీడియాలో వ్యంగ్య పోస్టులతో బాబుపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు. బాబుకు కేటాయించిన ఖైదీ నెంబర్.. గత ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన అసెంబ్లీ సీట్లతో సమానం అంటూ లెక్కగట్టడం నుంచి ఏపీ బంద్ను ప్రజలు పట్టించుకోలేదంటూ ట్వీట్లు చేశారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తెచ్చారు. చంద్రబాబు అరెస్టును తారక్ కనీసం పట్టుకోలేదన్నారు. దీన్నిబట్టి టీడీపీ భవిష్యత్తు దబిడి దిబిడే అని స్పష్టంగా అర్థం మవుతోందన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos