పవన్‌పై వర్మ చెణుకులు

పవన్‌పై వర్మ చెణుకులు

హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ పై సిని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ బుధవారం ట్విట్టర్‌లో పరోక్షంగా చురకలంటించారు. ఆయన పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల్ని ఉల్లేఖించి ఇవి ఎవరన్నారో తెలుసా? అని వీక్షకుల్ని ప్రశ్నించారు. ‘జగన్‌ నువ్వేలా సీఎం అవుతావో చూస్తా?, జగన్‌ చిన్న కోడికత్తికే గింజుకున్నారు, తెలంగాణలో ఆంధ్రులను కొడుతున్నారు, రాయలసీమ రౌడీలను గోదాట్లో కలిపేస్తా, నేను ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే ఆపేదెవడు?, జగన్‌ అవిశ్వాసం పెడితే దేశం మొత్తం తిరిగి 50 మంది ఎంపీల మద్దతు కూడగడతా,రెండు లక్షల పుస్తకాలు చదివా, 32 మార్కులతో 10 పాసయ్యా, మా అన్నయ్య కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోతే సాక్షిలో నీచంగా రాశారు.(ఆమె వెళ్లిపోయింది 2007లో అయితే సాక్షి పేపర్‌ 2008 మార్చిలో ప్రారంభమైంది)’ అని అవగాహన రాహిత్యంగా పలు సందర్భాల్లో పవన్‌ చేసిన వ్యాఖ్యలను పేర్కొన్నారు. వీటికి చాలా మంది స్పందించారు. జగన్‌ సీఎం ఎలా అవుతారో చూస్తానన్న పవన్‌ కల్యాణ్ శుక్రవారం విజయవాడలో జరిగే ప్రమాణ స్వీకారానికి వస్తే కనబడుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తాను ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఆపేదెవడన్న పవన్‌ కల్యాణ్‌ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదని ఎద్దేవా చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos